Viral Video | మొసలి (Crocodile)పైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియా (Australia)లో చోటు చేసుకుంది. నార్తర్న్ టెరిటరీ (Northern Territory)లోని కాహిల్స్ క్రాసింగ్ ప్రాంతంలో ప్రమాదకరమైన మొసళ్లు ఎక్కువగా ఉంటాయి. రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటిలో (River Crossing) ఉన్న మొసలిని గుర్తించని ఓ కారు డ్రైవర్.. వేగంగా ముందుకు వెళ్లాడు. దీంతో మొసలి కారు వెనుక చక్రాల్లో ఇరుక్కుపోయింది. కారు టైర్లకు ఏదో అడ్డుపడటాన్ని గుర్తించిన డ్రైవర్ రివర్స్ తీసుకున్నాడు. దీంతో ఆ మొసలి ఒక్కసారిగా కారు చక్రాల నుంచి బయట పడి నీటిలోకి జారిపోయింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
Kangana Ranaut | కంగనా రనౌత్‌కు ఎదురుదెబ్బ.. నటి పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు..!