Kangana Ranaut | కంగనా రనౌత్‌కు ఎదురుదెబ్బ.. నటి పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు..!
Kangana Ranaut | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు పంజాబ్-హర్యానా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బటిండా కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ పరువు నష్టం దావా రద్దు చేయాలంటూ కంగనా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
Kangana Ranaut | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు పంజాబ్-హర్యానా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బటిండా కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ పరువు నష్టం దావా రద్దు చేయాలంటూ కంగనా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద అభియోగాలు మోపారని, మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్ల ఉత్తర్వు చట్టబద్ధమైనదని జస్టిస్ త్రిభువన్ దహియా సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంపై ఆమె చేసిన ట్వీట్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. కంగనా చేసిన రీట్వీట్‌లో బటిండాకు చెందిన మహిందర్ కౌర్ ఫొటోలో అందులో ఉన్నది. ఢిల్లీ షాహిన్‌బాగ్ నిరసన తెలుపుతున్న మహిళలో లింక్ చేయడంపై తన పరువు భంగం కలిగించారని ఆమె కోర్టును ఆశ్రయించారు.
దాంతో కోర్టు పరువు నష్టం కేసులో కంగనాకు వ్యతిరేకంగా సమన్లు జారీ చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కంగనా రనౌత్ మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని.. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత చట్టపరమైన ప్రక్రియ మేరకు మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారని హైకోర్టు పేర్కొంది. ట్వీట్లో ఆమె ఉద్దేశమేమీ తప్పు కాదని.. సరిగ్గానే ట్వీట్ చేసిందని కంగనా తరఫు న్యాయవాది వాదనలు వినిపించినా కోర్టు అంగీకరించలేదు. కంగనా ఆ ట్వీట్ చేయలేదని.. కేవలం రీట్వీట్ చేసిందని.. ట్వీట్లో గౌతమ్ యాదవ్ పేరును చేర్చలేదని.. కంగనాపై మాత్రమే పిటిషన్ దాఖలైందంటూ చేసిన వాదనలను సైతం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు 2021 రైతు ఉద్యమం సమయంలో కంగనా ఈ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో మహిందర్ కౌర్ అనే 87 ఏళ్ల వృద్ధ మహిళ రూ.200 తీసుకుని ఆందోళనకు వచ్చినట్లుగా కంగనా ట్వీట్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

