Mumbai Cook | ముంబైకి చెందిన ఓ న్యాయవాది (Lawyer) పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ చర్చకు దారితీస్తోంది. తన ఇంట్లో వంటచేసే మనిషి (Mumbai Cook)కి నెలకు రూ.18 వేలు ఇస్తున్నట్లు తెలిపింది. అయితే, సదరు కుక్ 30 నిమిషాల్లో పని పూర్తి చేసి వెళ్లిపోతారని పేర్కొంది. అలా ఒకే కాంప్లెక్స్‌లో దాదాపు 10 నుంచి 12 ఇళ్లలో రోజూ పనిచేస్తారని చెప్పింది. సాధారణంగా కుటుంబం స్ట్రెంత్‌ను బట్టి ఒక్కో ఇంట్లో ఇంచుమించుగా 30 నిమిషాలు ఉంటారని చెప్పుకొచ్చింది. ప్రతిచోటా ఉచితంగా ఆహారం, టీ పొందుతారని, టైమ్‌కి జీతం కూడా అందుతుందని వివరించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘30 నిమిషాల ఉద్యోగానికి రూ.18 వేలు..? అతను ఏఐ ద్వారా వర్క్ చేస్తున్నారా..’ అంటూ ఓ యూజర్ పోస్టు పెట్టారు. ‘ఇదంతా అబద్ధం’, ‘ముంబైలో నాకు మంచి మిత్రులు ఉన్నారు. చాలా మంది స్థానిక మహిళలు రుచికరమైన ఆహారం వండుతారు. చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు’, ‘వంటవాడికి రూ.18 వేలా..?’, ‘మేము సౌత్ ముంబైలో ఉంటాము. అక్కడ వంట చేసే వాళ్లు 8 నుంచి 10 వేల వరకూ ఛార్జ్ చేస్తారు. రోజూ గంటపాటూ కుక్ చేస్తారు. 30 నిమిషాల్లో ఎలాంటి ఫుడ్ కుక్ చేస్తారు..? దీనికంటే రూ.25 వేలు ఇచ్చి ఫుల్‌టైమ్ కుక్‌ని పెట్టుకోవడం బెటర్. వాళ్లు చాలా రకాల వంటకాలు వండుతారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే.. ‘30 నిమిషాలు..? అంత తక్కువ సమయంలో మీరు ఎలాంటి ఫుడ్ చేయమని అడుగుతారు. ఒక్కో ఇంట్లో 30 నిమిషాలు చొప్పున… అతను రోజుకు 10 నుంచి 12 ఇళ్లలో ఎలా పని చేయగలడని అనుకుంటున్నారు..?’ అని ప్రశ్నించారు.
అయితే, నెటిజన్ల విమర్శలకు సదరు లాయర్ స్పందించారు. కొన్ని డీసెంట్ లొకేషన్స్‌లో కుక్స్ ఇంతే ఛార్జ్ చేస్తారని వివరణ ఇచ్చారు. అదే వంటమనిషి 12 మంది ఉన్న కుటుంబానికి రోజుకు రూ.2.5వేలు వసూలు చేస్తారని పేర్కొన్నారు. అందరూ అబద్ధాలే చెప్తారని అనుకోవద్దు అంటూ వ్యాఖ్యానించారు. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అని పేర్కొన్నారు.
Also Read..
UPI Rules | యూపీఐలో కీలక మార్పులు.. నేటి నుంచి అమల్లోకి కొత్తరూల్స్.. అవేంటో తెలుసా..?