Ex Clerk | జీతం రూ.15 వేలే.. 24 ఇండ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి.. సోదాల్లో బయటపడ్డ మాజీ క్లర్క్ బాగోతం
Ex Clerk | కర్ణాటక (Karnataka)లో భారీ అవినీతి తిమింగలం అధికారులకు చిక్కింది. క్లర్క్‌గా పనిచేసిన వ్యక్తిపై లోకాయుక్త దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.
Ex Clerk | కర్ణాటక (Karnataka)లో భారీ అవినీతి తిమింగలం అధికారులకు చిక్కింది. రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాలో కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL)లో క్లర్క్‌గా పనిచేసిన వ్యక్తిపై లోకాయుక్త దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.
లోకాయుక్త అధికారుల ప్రకారం.. కలకప్ప నిడగుండి కొప్పల్ జిల్లాలోని (Koppal district) కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL)లో గుమాస్తాగా (Ex Clerk) పనిచేశారు. ఆ సమయంలో రూ.15 వేల జీతం తీసుకునే అతడు.. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ కేఆర్ఐడీఎల్ ఇంజినీర్ చిన్చోల్కర్‌తో కలిసి నిడగుండి నకిలీ పత్రాలు, బిల్లులు సృష్టించి రూ.75 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో లోకాయుక్తా దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో దాదాపు రూ.30 కోట్లకు పైగా విలువైన ఆస్తులు బయటపడ్డాయి. దాదాపు 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులు నిడగుండి, ఆతని భార్య, సోదరుడి పేర్లతో ఉన్నట్లు తేలింది. అంతేకాదు, ఆయన నివాసం నుంచి 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కేజీల వెండి ఆభరణాలు, నాలుగు వాహనాలను (రెండు కార్లు, రెండు బైక్‌లు) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిడగుండిని అదుపులోకి తీసుకున్న లోకాయుక్త అధికారులు విచారణ చేస్తున్నారు.
Also Read..
Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. రేసులో ఉన్నది వీళ్లే
Viral Video | అదుపుతప్పి స్కూటీపై నుంచి కిందపడ్డ వ్యక్తి.. దూసుకెళ్లిన కారు.. రెప్పపాటులో ఎంత ఘోరం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

