Viral Video | మహారాష్ట్ర పూణె (Pune)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 61 ఏళ్ల వ్యక్తి స్కూటీ నుంచి కింద పడిపోగా.. అతడిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నగరంలోని ఔంధ్ ప్రాంతంలో (Aundh area) గల రాహుల్ హోటల్ సమీపంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జగన్నాథ్ కాశీనాథ్ కాలే (Jagannath Kashinath Kale) అనే 61 ఏళ్ల వ్యక్తి స్కూటీపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ కారును ఓవర్‌టెక్ చేస్తున్న క్రమంలో రోడ్డుపై గుంత కారణంగా అదుపుతప్పి కింద పడిపోయాడు. అదే సమయంలో వచ్చిన కారు అతడి తలపై దూసుకెళ్లింది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంతో అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఘటనాస్థలి వద్దకు పరుగులు తీశారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదంలో కాలే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. పూణె మున్సిపల్ కార్పొరేషన్‌తో జరిగిన సమావేశాల్లో రోడ్డుపై గుంతలకు మరమ్మతులు చేయాలనే విజ్ఞప్తిని అధికారులు పెడచెవిన పెట్టడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మేము పూణె మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు శాఖతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించాము. స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని, గుంతలను మరమ్మతులు చేయాలని, పోలీసు పెట్రోలింగ్ పెంచాలని పదేపదే అభ్యర్థించాం. అయినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు’ అని ఓ సామాజిక కార్యకర్త తెలిపారు.
Caught On Camera: Senior Citizen Crushed To Death By Car After Bike Skids In Pune’s Aundh pic.twitter.com/o0D72sBBOq
— Pune First (@Pune_First) August 1, 2025
Also Read..
Marco Rubio | రష్యాతో భారత్ చమురు బంధమే.. మాకు చికాకు తెప్పించే అంశం : అమెరికా విదేశాంగ మంత్రి