హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్)ను మార్చి 25లోగా అప్డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. ఆ తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని, ఇదే చివరి అవకాశమని కమిషన్ సెక్రటరీ ఎం హరిత వెల్లడించారు. ttps://w ww.tgpsc.gov.in వెబ్సైట్ను సంప్రదించి, వివరాలతోపాటు డాక్యుమెంట్ల ను అప్డేట్ చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ యూనివర్సిటీల్లోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(సీయూఈటీ) యూజీ దరఖాస్తుల స్వీకరణ మళ్లీ ప్రారంభమైంది. సోమవా రం నుంచి ఈ నెల 26 రాత్రి 11:50 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. తొలుత జనవరి 3 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించిన ఎన్టీఏ, అభ్యర్థుల కోరిక మేరకు దరఖాస్తుల విండోను తెరచి మరో అవకాశం కల్పించింది.