హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ను మంత్రి సీతక్క సోమవారం ఆవిష్కరించారు. మార్చి 6న నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా అధికారులకు పలు పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని టీజీవో నేతలు మంత్రిని ఆహ్వానించారు.
మహిళా అధికారులు, ఉద్యోగుల సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్, మహిళా విభాగం చైర్పర్సన్ దీపారెడ్డి, కోశాధికారి శాంతిశ్రీ పాల్గొన్నారు.