ముంబై: మహారాష్ట్రలో హిందీ మాట్లాడే ప్రజలపై ఇటీవల జరుగుతున్న దాడులపై జార్ఖండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) స్పందించారు. మరాఠా భాష పేరుతో ఈ హింసాత్మక దాడులకు ప్రేరేపిస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణసేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై ఆయన మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లేదా తమిళనాడులో ఇలాంటి దాడులు చేయాలని సవాల్ విసిరారు. ‘యూపీ, బీహార్ లేదా తమిళనాడుకు రండి. ప్రజలు మిమ్మల్ని పడేల్ పడేల్‌మని కొడతారు’ అని అన్నారు. అలాగే మహీం దర్గాకు వెళ్లి ఉర్దూ మాట్లాడే ఏ వ్యక్తిపైనైనా దాడి చేయాలని ఆయన సవాల్ చేశారు.
కాగా, మహారాష్ట్రలో పరిశ్రమలు లేవని, ఎక్కువగా పన్నులు వసూలు చేయరని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విమర్శించారు. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయంతో మహారాష్ట్ర నడుస్తున్నదని తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ వంటివి అక్కడ భారీ పరిశ్రమలు స్థాపించి మహారాష్ట్రకు పన్నులు చెల్లిస్తున్నారని అన్నారు. బీఎంసీ ఎన్నికల కోసమే ఠాక్రే సోదరులు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
#WATCH | Guwahati, Assam | On Raj Thackeray’s remark ‘beat but don’t make a video’, BJP MP Nishikant Dubey says, “…You people are surviving on our money. What kind of industries do you have?… If you are courageous enough and beat those who speak Hindi, then you should beat… pic.twitter.com/gRvAjtD0iW
— ANI (@ANI) July 7, 2025
Also Read:
Man Tears Road By Hand | నాసిరకంగా రోడ్డు నిర్మాణం.. చేతితో పెకలించిన వ్యక్తి
Watch: 15 అడుగుల కొండచిలువను చేతులతో మోసుకెళ్లిన పిల్లలు.. వీడియో వైరల్