Tapkeshwar Temple | ఉత్తరాది రాష్ట్రమైన ఉత్తరాఖండ్ (Uttarakhand)ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దీంతో రోడ్లు, వంతెనలు, ఇళ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.
తాజాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి డెహ్రాడూన్ (Dehradun) లోని ప్రసిద్ధ తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం (Tapkeshwar Mahadev Temple) ఒక భాగం కుప్పకూలింది. ఆలయం వద్ద చెట్లు కూలడంతో ప్రవేశమార్గం పాక్షికంగా మూసుకుపోయింది. దీంతో సోమవారం సావనాన్ని పురస్కరించుకొని పూజల కోసం ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ
(IMD) హెచ్చరించింది. ఈ మేరకు ఐదు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని పౌరి, డెహ్రాడూన్,
నైనిటల్, చంపావత్, భాగేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
#WATCH | Dehradun, Uttarakhand: A part of the famous Tapkeshwar Mahadev temple collapsed due to incessant rainfall pic.twitter.com/D2kV1DGI3j
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 21, 2023
Also Read..
Uttarakhand | ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు అలర్ట్
Sonia Gandhi | రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణంగా ముగిసింది.. కానీ, : సోనియా గాంధీ
Seema Haider | కరాచీ టు నోయిడా.. థీమ్ సాంగ్ వచ్చేసింది