GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ డీలిమిటేసన్(GHMC Delimitaion)కు సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదలైంది. డివిజన్ల సంఖ్యను 300లకు పెంచుతూ.. ప్రస్తుతమున్న ఆరు జోన్లను 12కు, ఇదివరకున్న 30 సర్కిళ్లను 60కి పెంచుతూ నోటిఫికేషన్ వెలువరించింది. సర్కిర్ కార్యాలయ్యాలో కొత్త జోన్లు ఏర్పడుతాయని జీహెచ్ఎంసీ తెలిపింది.
డివిజన్ల డీలిమిటేషన్‌కు సంబంధించి ఈనెల 9న ప్రాథమికి నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతో.. 6 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో సహేతుకుమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంది జీహెచ్ఎంసీ. వీటిని పరిశీలించి.. గురువారం డీలిమిటేషన్‌కు సంబంధించి తుది నోటిఫకేషన్. దీని ప్రకారం కొత్తగా శంషాబాద్, గోల్కొండ, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ జోన్లుగా ఏర్పడనున్నాయి.