రామాంతపురం : తమిళనాడులో త్వరలో కొత్త పార్టీని స్థాపించనున్నట్టు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైన శశికళ మంగళవారం ప్రకటించారు. జయలలిత జయంతి సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘మనం రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ అధ్యాయాన్ని చూడబోతున్నాం’ అని పేర్కొన్నారు. ‘త్వరలోనే నేను ఆ కొత్త పార్టీ పేరు ప్రకటిస్తా. అందులో ఎలాంటి మార్పు లేదు.
అది ప్రత్యర్థులను, ద్రోహులను తప్పక ఓడిస్తుంది. మనం రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని చూడబోతున్నాం’ అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తన పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. దానిపై ద్రవిడ నేత అన్నాదురై, ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్, జయలలిత ఫొటోలు ఉన్నాయి. అడ్డంగా త్రివర్ణంతో ఉన్న ఆ పతాకం పై భాగంలో నలుపు, మధ్యలో తెలుపు, అడుగు భాగాన ఎరుపు రంగు ఉన్నాయి.