Rythu Bandhu : పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరుతో షాక్‌తిన్న కాంగ్రెస్ సర్కార్ ఎంపీటీసీ, జడ్జీటీసీ ఎన్నికలపై మల్లగుల్లాల పండుతోంది. ప్రజా వ్యతిరేకతను ఎలా అధిగమించాలో తెలియక.. సంక్షేమ పథకాల అమలులోనూ వెనకడుగూ వేస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ ప్రభుత్వం ‘రైతు బంధు'(Rythu Bandhu)ను కూడా వాయిదా వేసింది.శాటిలైట్ ఇమేజ్ ద్వారా సాగు భూమిని గుర్తించేంత వరకు రైతుబంధు లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెబుతున్నారు. ఎలాగూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి రైతుబంధు ఇచ్చి వృథా అనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు సమాచారం. దాంతో.. రైతుబంధు పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది.
రైతు బంధు నిధులకు రేవంత్ సర్కార్ శాటిలైట్ మ్యాపింగ్ మెలిక పెట్టింది. సాగు భూమిని గుర్తించి, ఆ తర్వాతే రైతుబంధు ఇస్తామని చెప్పింది. దాంతో, అధికారులు శాటిలైట్ సర్వే సరిగ్గా చేయకపోతే రైతుబంధు పైసల్లో కోత పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు భూముల లెక్కలు తేలుస్తామని రెండేళ్లలో 4 దఫాల రైతుబంధు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఒకే ఒక్కసారి మాత్రమే రైతుబంధు విడుదల చేశారు. మళ్ళీ ఏమైనా ఎన్నికలు వస్తే తప్ప రైతుబంధు పైసలు రావడం కష్టమమని అధికారులు అంటున్నారు.
రైతుబంధు ఇప్పట్లో లేనట్లే
శాటిలైట్ ఇమేజ్ ద్వారా సాగు భూమిని గుర్తించే వరకు రైతుబంధు లేదని తేల్చిన మంత్రి తుమ్మల
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి రైతుబంధు ఇచ్చి వృధా అనే యోచనలో రేవంత్
మళ్ళీ మొదటికి వచ్చిన రైతుబంధు పంచాయతీ, కాలయాపన చేయడానికి సర్కారు మొగ్గు… pic.twitter.com/6iM9YJWYpi
— Telugu Scribe (@TeluguScribe) December 25, 2025