Sonia Gandhi | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) రాజకీయ జీవితం (Political Career ) అత్యంత దారుణమైన రీతి (Very Brutal Manner)లో ముగిసిందని ఆయన సతీమణి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) అన్నారు. అయితే, ఆయన తన కొద్ది రోజుల పాలనలోనే లెక్కలేనన్ని విజయాలు సాధించారని చెప్పారు. ఆదివారం జరిగిన 25వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం (25th Rajiv Gandhi National Sadbhavana Award ceremony)లో సోనియా పాల్గొని ప్రసంగించారు. మాజీ ప్రధాని రాజకీయ జీవితం చాలా క్రూరమైన రీతిలో ముగిసిందని అన్నారు.
‘రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం చాలా క్రూరమైన రీతిలో ముగిసింది. కానీ అతి తక్కువ సమయంలోనే అనేక మైలు రాళ్లను సాధించారు. ఆయన దేశ వైవిధ్యం పట్ల చాలా సున్నితంగా ఉండేవారు. ఎంతో అంకిత భావంతో పనిచేశారు. మహిళా సాధికారత, పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్లలో 1/3 వంతు మహిళల రిజర్వేషన్ కోసం ఎంతగానో పోరాడారు. నేడు 15 లక్షల మందికిపైగా ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు గ్రామీణ, పట్టణ సంస్థల్లో ఉన్నారంటే అది కేవలం రాజీవ్‌గాంధీ కృషి, దూరదృష్టి వల్లనే. అదేవిధంగా ఓటు వేసే వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు’ అని సోనియా వివరించారు.
Also Read..
Uttarakhand | ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు అలర్ట్
Samantha | ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి.. ఇండియా డే పరేడ్‌లో సమంత..
Chandrayaan-3 | మనం ఎప్పుడూ చూడని జాబిల్లి ఇదే.. దక్షిణ ధ్రువం ఫొటోలు పంపిన విక్రమ్ ల్యాండర్