Samantha | టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత (Samantha) అమెరికా వీధుల్లో సందడి చేసింది. న్యూయార్క్ (New York)లో జరిగిన వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ (India Day Parade)లో పాల్గొంది. ఏటా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల (Independence Day Celebrations)ను న్యూయార్క్ లో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా వేడుకలను నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఇండియా పరేడ్ లో సామ్ పాల్గొని సందడి చేసింది. సమంతోతపాటు ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికులతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు.
పరేడ్ లో భాగంగా సమంత మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఇక్కడ ఉండటం నిజంగా గౌరవం. భారత సంస్కృతి, వారసత్వం ఎంత గొప్పదో మీరు నాకు అర్థమయ్యేలా చేశారు. ఈ రోజు నేను చూసిన క్షణాలు నా మదిలో జీవితాంతం గుర్తుంటాయి. ఈ అరుదైన గౌరవం నాకు దక్కేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కెరీర్ లో నాకు మద్దతుగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా ప్రతి చిత్రాన్ని ఎంతో ఆదరిస్తున్నందుకు అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు’ అని సమంత తెలిపారు. ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో గతంలో అభిషేక్ బచ్చన్, రానా, అల్లు అర్జున్, అర్జున్ రాంపాల్, సన్నీ డియోల్, రవీనా టాండన్, తమన్నాలు హాజరయ్యారు.
ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ఖుషీ (Kushi) రిలీజ్ కు సిద్దంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 1న గ్రాండ్ లెవల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనితో పాటుగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ లో నటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సామ్ కాప్ గా కనిపించనుంది. ఈ సిరీస్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Lading actress @Samanthaprabhu2 rocks at the 41st #IndiaDayParade in #NewYork pic.twitter.com/vqA39ZTgOS
— Sreedhar Pillai (@sri50) August 21, 2023
Also Read..
Chandrayaan-3 | మనం ఎప్పుడూ చూడని జాబిల్లి ఇదే.. దక్షిణ ధ్రువం ఫొటోలు పంపిన విక్రమ్ ల్యాండర్
Uttarakhand | ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు అలర్ట్
Kavin | ప్రేయసిని పెళ్లాడిన తమిళ హీరో.. ఫోటోలు వైరల్