Kavin | ప్రేయసిని పెళ్లాడిన తమిళ హీరో.. ఫోటోలు వైరల్
Dada Movie Hero | దాదా సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న హీరో కెవిన్ తాజాగా తన ప్రేయసి మౌనికను ఘనంగా వివాహం చేసుకున్నాడు. వీరిపెళ్లికి ఇరుకుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.
Dada Movie Hero | దాదా సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న హీరో కెవిన్ తాజాగా తన ప్రేయసి మౌనికను ఘనంగా వివాహం చేసుకున్నాడు. వీరిపెళ్లికి ఇరుకుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు కెవిన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వివాహా మహోత్సవానికి నయనతార, విఘ్నేష్ శివన్‌లు హాజరై సందడి చేశాడు.
సీరియల్ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన కవిన్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన పిజ్జా సినిమాలో ఓ చిన్న రోల్లో మెరిసాడు. ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. అయితే కవిన్ పేరు తమిళ ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయింది మాత్రం నట్పున ఎన్నాను తెరియుమా సినిమాతోనే. ఈ సినిమాతో లీడ్ రోల్ అవతారం ఎత్తి సక్సెస్ అయ్యాడు. కమర్షియల్‌గా పెద్ద బ్లాక్ బస్టర్ కాలేదు కానీ.. ఈ సినిమాలో కవిన్ రోల్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
కవిన్‌కు మాత్రం బ్రేక్ ఇచ్చింది దాదా సినిమానే. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ సినిమా తమిళంలో కోట్లు కొల్లగొట్టింది. కేవలం రూ.4 కోట్లతో రూపొందిన ఈ మూవీ దాదాపు రూ.20 కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధించింది. ఇక ఇటీవలే ఓటీటీలో రిలీజై అక్కడ కూడా తిరుగులేని ఆదరణ దక్కించుకుంది. భాషతో సంబంధంలేకుండా అన్ని రాష్ట్రాల సినీ లవర్స్ ఈ సినిమాను దాదాపుగా చూసేసారు. ప్రస్తుతం కవిన్ రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు.
— Kavin (@Kavin_m_0431) August 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

