Seema Haider | కరాచీ టు నోయిడా.. థీమ్ సాంగ్ వచ్చేసింది
Seema Haider | పాక్ మహిళ సీమా హైదర్ (Seema Haider) ప్రేమకథ ఆధారంగా వస్తున్న చిత్రం ‘కరాచీ టు నోయిడా’ (Karachi to Noida). అమిత్ జానీ (Amit Jani) నిర్మిస్తున్న ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ తాజాగా విడుదలైంది.
Seema Haider | సీమా హైదర్ (Seema Haider).. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పబ్జీ గేమ్ (PUBG Game) ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా (Sachin Meena) కోసం తన నలుగురి పిల్లలతో పాకిస్థాన్ నుంచి భారత్‌కు అక్రమ మార్గంలో ప్రవేశించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ‘కరాచీ టు నోయిడా’ (Karachi to Noida) పేరుతో అమిత్ జానీ (Amit Jani) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా, ఈ చిత్ర థీమ్ సాంగ్ (Theme Song) ‘చల్ పడే హైన్ హమ్’ (Chal Pade Hain Hum)ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఢిల్లీలోని శంకర్ భారతీయ ఆడిటోరియంలో ఈ థీమ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను ప్రీతి సరోజ్ ఆలపించగా, నిర్మాత అమిత్ జానీ లిరిక్స్ రాశారు. కాగా, ఈ చిత్రంలోని సీమా హైదర్ పాత్రలో ఫర్హీన్ ఫలక్ ( Farheen Falak) నటిస్తోంది. ఈ చిత్రానికి శశాంక్ దుర్గ్వంశీ సంగీతాన్ని అందిస్తున్నారు. భరత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ పాట విడుదలైన గంటల వ్యవధిలోనే లక్షల మంది వీక్షించారు. ప్రస్తుతం ఈ పాట అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
కాగా, పాక్ జాతీయురాలైన 30 ఏళ్ల సీమా హైదర్.. ఉత్తరప్రదేశ్ కు చెందిన 22 ఏళ్ల సచిన్ మీనా (Sachin Meena)తో పబ్జీ గేమ్ ద్వారా ప్రేమలో పడింది. అతడి కోసం నలుగురు పిల్లలతో సహా పాక్ సరిహద్దును దాటి భారత్ లోకి అక్రమంగా అడుగుపెట్టింది. అనంతరం సచిన్ మీనాను వివాహం చేసుకున్న సీమా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో నివాసముంటోంది. మరోవైపు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మామ పాకిస్థాన్ ఆర్మీలో సుబేదార్ కాగా, సోదరుడు కూడా పాక్ ఆర్మీలో సైనికుడని తెలిసింది. ఈ నేపథ్యంలో సీమా హైదర్‌ను పాకిస్థాన్ స్పైగా అనుమానిస్తున్నారు.
Also Read..
Tulip Garden | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తులిప్ గార్డెన్
Sonia Gandhi | రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణంగా ముగిసింది.. కానీ, : సోనియా గాంధీ
Samantha | ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి.. ఇండియా డే పరేడ్‌లో సమంత..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

