Tulip Garden | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తులిప్ గార్డెన్
Tulip Garden | భూతల స్వర్గం కశ్మీర్ (Kashmir )కు మరో అందం శ్రీనగర్ (Srinagar)లో ఉన్న ఇందిరా గాంధీ స్మారక తులిప్ గార్డెన్ ( Indira Gandhi Memorial Tulip Garden). తాజాగా ఈ గార్డెన్ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book of Records)లో చోటు దక్కించుకుంది.
Tulip Garden | భూతల స్వర్గం కశ్మీర్ (Kashmir )కు మరో అందం శ్రీనగర్ (Srinagar)లో ఉన్న ఇందిరా గాంధీ స్మారక తులిప్ గార్డెన్ ( Indira Gandhi Memorial Tulip Garden). ఇంద్ర ధనస్సు నేలపైకి వచ్చి, భూమిపై తివాచీ పరిచినట్లు రంగు రంగుల పూలతో పర్యాటకులను కనివిందు చేస్తుంటుంది. రంగురంగుల విరులను చూసేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు శ్రీనగర్‌కు క్యూ కడుతుంటారు. కాగా, తాజాగా ఈ గార్డెన్ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book of Records)లో చోటు దక్కించుకుంది. 68 రకాలకు చెందిన 1.5 మిలియన్ల తులిప్ పువ్వులతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్‌గా ఈ ఘనత సాధించింది.

శ్రీనగర్‌లోని తులిప్‌తోట.. ఆసియాలోనే అతి పెద్దది. దాల్ సరస్సు (Dal Lake) తీరానా జబర్వాన్ కొండల (Zabarwan hills) మధ్య విస్తరించి ఉన్న ఈ తోట ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు శ్రీనగర్‌కు క్యూ కడుతుంటారు. దేశ, విదేశాల నుంచి భారీగా తరలివస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పూల గార్డెన్లు ఉన్నాయి. అయితే శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే (Asias Largest) అతిపెద్దది. ఈ గార్డెన్ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 హెక్టార్లు ఉంది. అదేవిధంగా ప్రతి ఏడాది వసంత రుతువు ప్రారంభంలో తులిప్ ఫెస్టివల్ పేరుతో ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. శ్రీనగర్ టూరిజం ప్రకారం, కశ్మీర్ లోయలో పూల పెంపకం, పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో ఈ పార్క్‌ను 2007లో ప్రారంభించారు.

Also Read..
Sonia Gandhi | రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణంగా ముగిసింది.. కానీ, : సోనియా గాంధీ
Samantha | ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి.. ఇండియా డే పరేడ్‌లో సమంత..
Chandrayaan-3 | మనం ఎప్పుడూ చూడని జాబిల్లి ఇదే.. దక్షిణ ధ్రువం ఫొటోలు పంపిన విక్రమ్ ల్యాండర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

