లక్నో: ఇంట్లోని గదిలో తల్లిదండ్రులున్నారు. బాల్కానీలోకి వచ్చిన ట్రైనీ డాక్టర్ 21వ అంతస్తు నుంచి కిందకు దూకి మరణించాడు. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Trainee Doctor suicide) ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. 29 ఏళ్ల శివ 2015 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థి. ఢిల్లీలోని మెడికల్ కాలేజీలో చదివాడు. 2020లో కరోనా మహమ్మారి సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో డాక్టర్ ట్రైనింగ్ ఆపేశాడు. దీని వల్ల అతడు తీవ్ర నిరాశలో ఉన్నాడు.
కాగా, మధురలో నివసిస్తున్న శివ, తన తల్లిదండ్రులతో కలిసి నోయిడాలోని గౌర్ సిటీ 2లో నివసిస్తున్న సోదరి ఇంటికి వచ్చాడు. సోమవారం మధ్యాహ్నం అపార్ట్మెంట్లోని గదిలో పేరెంట్స్ ఉన్నారు. అయితే బాల్కానీలోకి వచ్చిన శివ, 21వ అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని హాస్పిటల్కు తరలించగా మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శివ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Bengaluru Student Dies | మరో విద్యార్థిని ప్రాణాలు తీసిన.. బెంగళూరు రోడ్డు గుంతలు
Leh Apex Body | కేంద్రంతో చర్చలను బహిష్కరించిన లేహ్ అపెక్స్ బాడీ
Watch: హుక్ తెగి పక్కకు ఒరిగిన జైంట్ వీల్, గాలిలో రైడర్స్.. తర్వాత ఏం జరిగిందంటే?