ATM | ప్రస్తుతం అంతా డిజిటల్ మయమైపోయింది. చేతిలో రూపాయి లేకున్నా ఫోన్ ఉంటే చాలు. డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేయొచ్చు. డిజిటల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జనాలు నగదును చాలా ఈజీగా ఫోన్ పే, గూగుల్‌పే వంటి యాప్స్ ద్వారా బదిలీ చేసేస్తున్నారు. ఇంటి రెంట్లు, కరెంటు బిల్లులు, పాల బిల్లులు ఇలా ఒకటేంటి చిన్న చిన్న అమౌంట్‌ను కూడా డిజిటల్ రూపంలోనే చెల్లిస్తున్నారు. అయినప్పటికీ ఏటీఎమ్లకు (ATM) మాత్రం ఆదరణ తగ్గడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికీ ఏటీఎమ్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
ఒకప్పుడు ఎక్కడో ఒకటి లేదా రెండు చోట్ల కనిపించే ఏటీఎమ్‌లు ఇప్పుడు ప్రతీ వీధిలోనూ దర్శనమిస్తున్నాయి. షాపింగ్ మాల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కదిలే రైళ్లలోనూ ఏటీఎమ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. అవునండి.. మీరు విన్నది నిజమే. ప్రయాణికుల కోసం రైళ్లలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ (Indian Railways) కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా ఓ మార్గంలో వీటిని ఇప్పటికే ప్రవేశపెట్టింది కూడా.
సెంట్రల్ రైల్వే (Central Railway) తొలిసారిగా ముంబై -మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్ (Mumbai-Manmad Panchavati Express)లో ప్రయోగాత్మకంగా ఏటీఎమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని రైల్వే అధికారులు తాజాగా వెల్లడించారు. పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి రోజూ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకూ వెళ్తుంది. ఈ రెండింటి మధ్య ప్రయాణం నాలుగున్నర గంట పడుతుంది. ఆ మార్గంలో ఈ రైలు చాలా కీలకమైందిగా భావిస్తారు. దీంతో ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎమ్ సేవలను తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఓ ప్రైవేటు బ్యాంక్‌కు చెందిన ఏటీఎమ్‌ను ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లో ఏర్పాటు చేసింది. రైలు కదులుతున్నప్పుడు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండటానికి దీనికి షట్టర్ డోర్‌ను కూడా అమర్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లోని రైళ్లలోనూ ఏటీఎమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
#WATCH | A trial run for the ATM on Wheels project was successfully conducted. Central Railways set up the first ATM of the Bank of Maharashtra on the Manmad-CSMT Panchvati express.
Source: Ashwini Vaishnaw ‘X’ handle pic.twitter.com/tIFpuSXMGA
— ANI (@ANI) April 16, 2025
Also Read..
Ravi Shanker Prasad | కాంగ్రెస్ అగ్రనేతలు ఆ పత్రికను ఏటీఎంలా వాడుకున్నరు : బీజేపీ
Dinesh Maheshwari: లా కమీషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దినేశ్ మహేశ్వరి
Justice BR Gavai | సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్