Justice BR Gavai : భారత సుప్రీంకోర్టు (Supreme Court) తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI) గా జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai) నియమితులయ్యారు. కొలీజియం సిఫారసుల మేరకు ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna) తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ పేరును ప్రతిపాదించారు. వచ్చే నెల 13న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం ముగియనుండటంతో ఆయన స్థానంలో కొత్త ప్రధాన న్యాయమూర్తిని ప్రకటించారు.
జస్టిస్ గవాయ్ మే 14న సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా డీవై చంద్రచూడ్ పదవీ విరమణతో ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా 2024 నవంబర్లో ప్రమాణస్వీకారం చేశారు. గవాయ్ పూర్తిపేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. ఆయన 1960 నవంబర్ 24న అమ్రావతిలో జన్మించారు. 1985 మార్చి 16న బార్లో సభ్యుడిగా చేరారు.