Ceasefire | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ (LoC) వెంబడి కాల్పులకు పాల్పడింది. జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో గల కృష్ణ ఘాట్ సెక్టార్ (Krishna Ghati sector)లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
నియంత్రణ రేఖ వెంబడి తార్కుండి ప్రాంతంలో ఉన్న ఫార్వర్డ్ పోస్ట్‌పై పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరిపింది. దాదాపు 10 నుంచి 15 రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు (Indian Army) పాక్ చర్యను తిప్పికొట్టాయి. వారిపై ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో పాకిస్థాన్ వైపు భారీగా ప్రాణనష్టం జరిగినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. అయితే ఎంత మంది చనిపోయారన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
కాగా, 2021 ఫిబ్రవరి 25న భారత్ – పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుంచి నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘన చాలా అరుదు. అయితే, ఇటీవలే పాకిస్థాన్ ఎక్కడో ఒకచోట కవ్వింపులకు పాల్పడుతూ వస్తోంది. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో కొంతమంది చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఏడుగురు హతమయ్యారు. వీరిలో కొందరు పాక్ భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
Also Read..
PM Modi | అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ
Supreme Court | ఉచితాలిస్తే ప్రజలు పనిచేయరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు