Pakistan Airspace | గత నెల పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యకు పూనుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులకు దిగింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది. భారత్ మెరుపు దాడులతో పాక్ ఎయిర్‌స్పేస్ (Pakistan Airspace) ఖాళీ అయ్యింది.
ఈ దాడులతో అన్ని దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్ పాక్ గగనతలాన్ని పక్కన పెట్టాయి. ఎయిర్ స్ట్రైక్స్ జరగొచ్చనే భయంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. అదే సమయంలో భారత్ ఎయిర్‌స్పేస్ (Indian Airspace) బిజీగా కనిపించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన పిక్టోరియల్ ఫొటోను ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ విడుదల చేసింది.
No commercial flights are currently operating over Pakistani airspace, as international airlines are rerouting to steer clear of the region due to the ongoing tensions. #IndiaPakistanWar #IndiaPakistan #IndiaPakistanTensions pic.twitter.com/u7WwA9XxVT
— Asif Khan (@_asif) May 7, 2025
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ప్రధాన స్థావరమైన ముర్కిదేను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అర్ధరాత్రి 1.44 గంటలకు ముర్కిదేలోని లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరంపై మిస్సైళ్లతో భారత్ మెరుపుదాడి చేసింది. పాకిస్తాన్‌లోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన లాహోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ముర్కిదే ఉంది. ముర్కిదేలో 200 ఎకరాల్లో లష్కరే తోయిబా తన ఉగ్రస్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ జమ్మత్ ఉద్ దఆవా కూడా ఇక్కడ్నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది. లష్కరే తోయిబా చీఫ్ హాఫీజ్ సయీద్ పహల్గాం ఉగ్రదాడి వెనుకాల ఉన్నట్లు భారత్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే లష్కరే తోయిబా ఉగ్రస్థావరాన్ని టార్గెట్ చేసి నేలమట్టం చేసింది.
బవహల్పూర్లోని ఉస్మాన్ ఓ అలి క్యాంప్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైంది. ఇది 18 ఎకరాల్లో విస్తరించింది. వాస్తవానికి దీన్ని 2019లోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకుంది. కానీ నాడు చివర్లో వదిలేసింది. ఈ సారి మాత్రం దాన్ని నేలమట్టం చేసింది. ముర్కిదే, బవహల్పూర్లోని క్యాంపుల్లో 25 నుంచి 30 మంది చొప్పున టెర్రరిస్టులు హతమై ఉంటారని తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించనుంది.
Also Read..
Lashkar-e-Taiba | ‘టెర్రర్ నర్సరీ’గా ‘ముర్కిదే’.. లష్కరే తోయిబా ప్రధాన స్థావరం ఇక్కడే
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్.. 80 మందికి పైగా ఉగ్రవాదులు హతం..!
OPERATION SINDOOR | ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ప్రతీకారం.. స్పందించిన ట్రంప్, గుటెర్రాస్