ఎదులాపురం, జనవరి 24 : ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రతి ఒకరు ప్రశాంత జీవనం గడపాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బృందావన్ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ రెండో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు చేశారు.
ఈ మేరకు జోగు రామన్న మాట్లాడుతూ.. కాలనీవాసులంతా ఐక్యంగా ఉంటూ ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఆంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు.