సారంగాపూర్, జనవరి 24 : ఆన్లైన్ బెట్టింకు బానిపై ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో శనివారం చోటు చేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రాణాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ ప్రేమ్‌కుమార్(39) ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. దీనికి తోడు కొన్ని నెలల క్రితం ఫర్టిలైజర్ వ్యాపారంలో నష్టం వాటిల్లింది. ఆన్లైన్ బెట్టింగ్, ఫర్టిలైజర్ వ్యాపారంలో కలిపి రూ.70 లక్షలు నష్టపోవడంతో మనస్థానికి గురయ్యాడు.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు.కుటుంబ సభ్యులు శనివారం ఉదయం వెతుకగా చించోలి(బి) సమీపంలోని మైనార్టీ విద్యాలయానికి దూరంలో ప్రేమ్‌కుమార్ బ్లేడ్‌తో తనచేయి మణికట్టు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే మృతుడి ప్రదేశంలో పురుగులమందు డబ్బా కూడా లభించింది. ప్రేమ్‌కుమార్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రేంకుమార్ తండ్రి జాదవ్ తారచంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.