Elephant Calf | అతడి పేరు బిపిన్ కాశ్యప్.. ఏనుగులంటే అతనికి చాలా ఇష్టం. గజరాజులపై తనకున్న ప్రేమను చాటి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. తనకిష్టమైన గున్న ఏనుగు పుట్టినరోజును ఘనంగా జరిపి నెట్టింట ప్రశంసల వర్షం అందుకుంటున్నాడు బిపిన్ కాశ్యప్. అసోంలో ప్రియాన్షి (మొమో అని కూడా పిలుచుకుంటారు) ఏనుగు పిల్ల పుట్టినరోజు సందర్భంగా బిపిన్ కాశ్యప్ హ్యాప్ బర్త్ డే అంటూ రాసిన పేపర్ కటింగ్స్‌ను దండలా చేశాడు. మొమో పేరుతో ప్రత్యేకంగా కేక్‌ను సిద్ధం చేశాడు.
మొమోకు ఇష్టమైన రకరకాల పండ్లను, ఇతర ఆహార పదార్థాలను తీసుకొచ్చాడు. మొమో ముందు వాటన్నింటిని పెట్టి.. హ్యాపీ బర్త్ డే అంటూ మాలను దాని మెడలో వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. క్యూట్‌గా ఉన్న బేబి ఎలిఫెంట్ బర్త్ డే వీడియోను చాలా మంది నెటిజన్లు ఎంజాయ్ చేస్తూ విషెస్ తెలియజేశారు.
జంతువుల పట్ల అమితమైన ప్రేమ చూపిస్తూ.. వాటిని ఆదరిస్తున్న వారి గొప్ప మనస్సుకు ఫిదా అయిపోతూ మొమోకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఓ యూజర్ కామెంట్ పోస్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత అందమైన సీనర్ అంటూ మరో యూజర్ కామెంట్ చేయగా.. ఈ జంతువులను ప్రేమిస్తున్న మిమ్మల్ని దేవుడి ఆశీస్సుంటాయి అని మరో నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు.
Dhanush – Mrunal | ధనుష్‌తో పెళ్లి పుకార్ల మధ్య మృణాల్ ఠాకూర్ వైరల్ వీడియో… షాక్ అవుతున్న నెటిజన్స్
MSG | లాంగ్ వీకెండ్ టార్గెట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’… మళ్లీ ఊపందుకున్న మెగాస్టార్ సినిమా
Rimi Sen | నటన రాదు అయిన స్టార్ అయ్యాడు.. జాన్ అబ్రహంపై రిమీ సేన్ సంచలన వ్యాఖ్యలు