Dhanush – Mrunal | దక్షిణాది సినిమాల నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఆమె వివాహం జరగబోతుందంటూ వస్తున్న పుకార్లు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరిలో వీరిద్దరూ ఏడడుగులు వేయనున్నారనే వార్తలు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం ఒక్కసారిగా పెరిగింది. అయితే ఈ ప్రచారం మధ్యలో ఓ వీడియో అందరిని షాక్‌కి గురి చేసింది. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ధనుష్, మృణాల్ పెళ్లి పీటలపై కూర్చొని ఉండగా, వారిని ఆశీర్వదించడానికి త్రిష, విజయ్, శృతి హాసన్, అనిరుధ్ వంటి స్టార్ సెలబ్రిటీలు వచ్చినట్టు తెలుస్తుంది.
అయితే ఈ వీడియో చూసి ఏంటి.. వారిరివురు నిజంగానే పెళ్లి చేసుకున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాని అది ఏఐ వీడియో అని స్పష్టంగా తెలుస్తుంది.కావాలని సెలబ్రిటీల ముఖాలతో వీడియో చూసి వైరల్ చేస్తున్నారు. దీనిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అజయ్ దేవగన్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్ వేడుకలో ధనుష్, మృణాల్ కలిసి కనిపించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పలుమార్లు వీరి పేర్లు కలిసి వినిపించడంతో డేటింగ్ వార్తలు మరింత బలంగా ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా పెళ్లి వార్తలు కూడా రావడంతో ఇది నిజమేనని కొందరు భావించగా, మరికొందరు దీనిని కేవలం రూమర్స్గా కొట్టిపారేశారు.
ఈ నేపథ్యంలో మృణాల్‌కు దగ్గరైన వర్గాలు స్పందిస్తూ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాయి. మృణాల్ ప్రస్తుతం పూర్తిగా తన కెరీర్‌పైనే ఫోకస్ చేస్తున్నారని, పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదని వారు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా ఊహాగానాలేనని కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ పెళ్లి పుకార్లపై ధనుష్ కానీ, మృణాల్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇద్దరూ తమ తమ సినిమాల షూటింగ్స్, కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం ఇంకా పుకార్ల స్థాయిలోనే కొనసాగుతోంది. నిజం ఏంటన్నది అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత వచ్చే అవకాశముంది.