Operation Sindoor | ఆపరేషన్ సిందూర్.. 80 మందికి పైగా ఉగ్రవాదులు హతం..!
Operation Sindoor | మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపుదాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది.
Operation Sindoor | న్యూఢిల్లీ : పహల్గాం బైసరన్‌లో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు భారత సైన్యం బుద్ధి చెప్పింది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపుదాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది.
జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్లతో ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. బహవల్పూర్ జైషే మహ్మద్, ముర్కిదేలోని లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపుల్లో 25 నుంచి 30 మంది చొప్పున టెర్రరిస్టులు హతమై ఉంటారని తెలిపారు. ముర్కిదే ప్రాంతం టెర్రర్ నర్సరీగా పేరుగాంచింది. ఎందుకంటే ఈ క్యాంపును 200 ఎకరాల్లో విస్తరించి, ఉగ్రవాద శిక్షణా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ముర్కిదే ఒక నర్వ్(నాడీ) సెంటర్‌గా పేరుగాంచింది. అయితే 80 నుంచి 90 మంది దాకా టెర్రరిస్టులు చనిపోయినట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

