Saalumarada Thimmakka | ప్రకృతితో ఐక్యంగా జీవితాన్ని మార్చుకున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణవేత్త (environmentalist), పద్మశ్రీ (Padma Shri) అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క (Saalumarada Thimmakka) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 114. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తిమ్మక్క బెంగళూరు (Bengaluru)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
1911, జూన్ 30న తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో తిమ్మక్క జన్మించారు. కర్ణాటక గ్రామీణ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడంలో ఎంతో కృషి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 25 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి, పచ్చదనం, పర్యావరణం కోసం ఆమె పనిచేస్తున్నారు. తిమ్మక్క అందించిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అంతేకాదు, బీబీసీ ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో తిమ్మక్క ఒకరిగా నిలిచారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ, ప్రకృతి ప్రేమికులు సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read..
NDA | బీహార్లో ఎన్డీయే డబుల్ సెంచరీ.. 201 స్థానాల్లో ఆధిక్యం.. ఏ పార్టీకి ఎన్నంటే..?
Congress | బీహార్లో పనిచేయని ఓట్ చోరీ అస్త్రం.. రాహుల్ ఎక్కడ..? అంటూ నెట్టింట పోస్టులు