చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు చేస్తున్న పనులు జనాలకు వినోదం పంచుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కుష్బూ దోసెలు వేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఒకరు ఇడ్లీలు చేస్తూ, మరొకరు ఇస్త్రీ చేస్తూ, ఇంకొకరు కొబ్బరి బోండాలను కొడుతూ ఎవరికి తోచినట్లుగా వాళ్లు వివిధ పనులతో ఓటర్ల దృష్టిలో పడే ప్రయత్నం చేశారు.
తాజాగా మనప్పరాయ్ నియోజకవర్గానికి చెందిన డీఎంకే అభ్యర్థి అబ్దుల్ సమద్ మురుకులు చేసి ఓటర్ల మనసు దోచేందుకు ప్రయత్నించారు. ప్రచారంలో భాగంగా ఓ పిండివంటల దుకాణం దగ్గరికి వెళ్లిన ఆయన.. అక్కడ కాసేపు గిద్దెలతో మురుకులొత్తారు. మరికాసేపు కడాయిలో మురుకులను వేయించి తీశారు. కాగా, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 6న జరుగనున్నది.
Tamil Nadu: P Abdul Samad, DMK candidate from Manapparai, makes 'muruku' as part of election campaign, ahead of single-phase Assembly elections on April 6 pic.twitter.com/eFxlwfjbl9
— ANI (@ANI) April 4, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్‌పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
దేశంలో ఇప్పటివరకు 7.5 కోట్ల మందికి వ్యాక్సిన్: కేంద్రం
ఛత్తీస్‌గఢ్‌లో 24కు చేరిన నక్సల్స్ దాడి మృతులు..!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా
పక్కా ప్లాన్ ప్రకారమే మెషిన్ గన్లు, దేశీ రాకెట్లతో నక్సల్స్ దాడి..!
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కు కరోనా
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?