నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?

న్యూఢిల్లీ: మ్యాగీ, పానీ పూరి, ఐస్ క్రీమ్, పరోటా, న్యుటెల్లా బిర్యానీ తదితర వింతైన, విచిత్ర వంటకాల గురించి చాలామందికి తెలుసు. కానీ, నీళ్లను డీప్ ఫ్రై చేయడం గురించి మీలో ఎవరికైనా తెలుసా..? వాటర్‌ను డీప్ ఫ్రై చేయడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా..? మీరు విన్నది నిజమే..! నేను చెబుతున్నది డీప్ ఫ్రైడ్ వాటర్ అనే కొత్త రకం వంటకం గురించే..! మరి ఈ డీప్ ఫ్రైడ్ వాటర్ సంగతేందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే పదండి..
ఈ సీజన్లోనే లేటెస్ట్ ఫుడ్ ట్రెండ్ అయిన డీప్ ఫ్రైడ్ వాటర్ ఇప్పటికే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నది. ఈ కొత్త రకం వంటకంపై నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది. వాస్తవానికి డీప్ ఫ్రైడ్ వాటర్ మొదటి వీడియోను 2016 లోనే యూట్యూబ్‌లో పోస్ట్‌చేశారు. కానీ అప్పట్లో అది ట్రెండింగ్ కాలేదు. అయితే 2020, డిసెంబర్లో జేమ్స్ ఆర్గిల్ అనే కెమికల్ ఇంజినీర్ మొదటిసారి డీప్ ఫ్రైడ్ వాటర్‌ను ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. ఆ వీడియోను ది యాక్షన్ ల్యాబ్ అనే తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అసలు డీప్ ఫ్రైడ్ వాటర్ అంటే ఏంది..?
డీప్ ఫ్రైడ్ వాటర్ అంటే మీలో చాలామంది మరిగే నీళ్లకు మరో కొత్తరకం పేరు అని ఊహిస్తూ ఉండవచ్చు. కానీ ఊహ నిజం కాదు. కాల్షియం ఆల్జీనేట్ అనే రసాయన సమ్మేళనాన్ని ఉపయోగించి నీళ్లను కూడా డీప్ ఫ్రై చేయవచ్చు. సజల కాల్షియం క్లోరైడ్, సజల సోడియం ఆల్జీనేట్ల మిశ్రమా ఈ డీప్ ఫ్రైడ్ వాటర్ తయారికీ ఉపయోగిస్తారు. ఈ రెండు రకాల రసాయనాలు నీటి చుట్టూ ఒక స్తరంలా ఏర్పడి నీటిని బంధించి ఉంచుతాయి.
డీప్ ఫ్రైడ్ వాటర్ అనే భావన మొట్టమొదట 2016లో ఫుడ్ బ్లాగర్, చెఫ్, ఫ్రైడ్ ఫుడ్ అభిమాని అయిన జోనాథన్ మార్కస్ మదిలో మెదిలింది. ఆయన వాటర్‌ను డీప్ ఫ్రై చేసి ఆ వీడియోను యూట్యూబ్ పేజీలో అప్లోడ్ చేశాడు. కానీ అప్పట్లో ట్రెండ్ కాలేదు. అయితే, ఇప్పుడు జేమ్స్ ఆర్గిల్ తయారుచేసిన డీప్ ఫ్రైడ్ వాటర్ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. అయితే, డీప్ ఫ్రైడ్ వాటర్‌ను తయారు చేయాలనుకునే వారికి జేమ్స్ హెచ్చరిక చేశారు. ఎందుకంటే సరైన రీతిలో చేయకపోతే ఇది చాలా ప్రమాదకరమని ఆయన చెబుతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నేను కరుణానిధి బిడ్డను.. బీజేపీ బెదిరింపులకు భయపడను: స్టాలిన్
బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్న ఆ హైదరాబాదీని తిరస్కరించండి: మమతాబెనర్జి
ఆస్ట్రాజెనికా టీకా అవసరంరాదేమో : అమెరికా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కేజీ రూ. లక్ష
ఊర్వశి వాట్సాప్ బ్లాక్.. ఇశా నేగితో రిషబ్ డేటింగ్ !
బైడెన్ ప్రసంగంలో హోలీ ప్రస్తావన
డొనాల్డ్ ట్రంప్‌లా మమత తీరు: బీజేపీ
కొవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై
రాబర్ట్ వాద్రాకు కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ప్రియాంక దంపతులు
మమతది 3టీ మోడల్ ప్రభుత్వం: అమిత్ షా
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

