Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు (Delhi Schools) మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపుతున్నాయి. నగరంలోని ఏకంగా 40 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.
ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS), పశ్చిమ్ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూల్ సహా మొత్తం 44 పాఠశాలలకు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఆయా పాఠశాలల ఆవరణలో బాంబులు అమర్చినట్లు ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. వాటిని పేల్చకుండా ఉండాలంటే 30 వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బెదిరింపు మెయిల్స్‌తో అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు విద్యార్థులను (Students) ఇంటికి పంపించేశారు. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్ సాయంతో ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదని పోలీసులు తెలిపారు. కాగా, ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ బెదిరింపులు వచ్చినట్లు గుర్తించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Bribe | ముడుపులు ముడితేనే పనులు.. దేశంలో పెచ్చరిల్లిన అవినీతి!
Car Prices Hike | హ్యాచ్‌బ్యాక్ మొదలు హై-ఎండ్ వరకు.. జనవరిలో పెరగనున్న కార్ల ధరలు
Richest Beggar | ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చడు మనోడే.. నెల సంపాదన ఎంతో తెలుసా?