Richest Beggar | ముంబై: ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా భరత్ జైన్ వార్తల్లో నిలిచాడు. ‘ఎకనమిక్ టైమ్స్’ నివేదిక ప్రకారం, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును అర్ధాంతరంగా ఆపేసిన భరత్ బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు. తన పిల్లలు తన మాదిరిగా కష్టాలు పడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఆయన నెల సంపాదన రూ.60,000 నుంచి రూ.75,000 ఉంటుంది.
ఆయనకు ముంబైలో రూ.1.4 కోట్ల విలువైన రెండు ఫ్లాట్స్, థాణేలో రెండు దుకాణాలు ఉన్నాయి. వీటి నుంచి ఆయనకు నెలకు రూ.30,000 వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడులు పెట్టడంలో కూడా ఆయన తన ప్రతిభను చూపుతున్నారు. ఇద్దరు కుమారులు స్థిరపడినప్పటికీ, భరత్ మాత్రం భిక్షాటనను మానలేదు.