అచ్చంపేట రూరల్, మార్చి 16 : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కొర్ర కమల భర్త సతీశ్, నాయకులు కొర్ర సీతారాం నాయక్, నారాయణపై కాంగ్రెస్ అచ్చంపేట మండల అధ్యక్షుడు దొడ్ల నర్సయ్యయాదవ్, అతడి అనుచరులు దొడ్ల వినోద్, దొడ్ల రామకృష్ణ, దొడ్ల పద్మ దాడిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సతీశ్, సీతారం, నారాయణ గ్రామంలోని ఆటో స్టాండ్ వద్ద నిలబడి ఉండగా.. పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని.. కాంగ్రెస్ నాయకులు కులం పేరుతో దూషి స్తూ రాళ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు. స్థానికులు గాయపడిన ముగ్గురిని దవాఖానకు తరలించారు. ఎస్సై సద్దాం హుస్సేన్ వివరణ కోరగా.. అంకిరోనిపల్లిలో ఇరువర్గాలు దాడు లు చేసుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు మరో ఇరువురిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.