Operation Sindoor | పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాక్‌పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా (Pak terror camps) దాడులు చేసింది. ఈ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్‌లో దాదాపు 200కి పైగా విమానాలు రద్దయ్యాయి (200 flights cancelled). అంతేకాదు శ్రీనగర్, లెహ్, అమృత్సర్, చండీగఢ్ సహా కనీసం 18 విమానాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు (18 airports shut). బుధవారం ఉదయం నుంచి ఆయా విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్.. అందుకు ప్రతీకారం తీర్చుకుంది. పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడులు చేసింది. ముఖ్యంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పూర్తిగా ధ్వంసం చేసింది. భారత్ విజయవంతంగా చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్ కారణంగా దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో భారత గగనతలంలో కొంత మేర కేంద్రం ఆంక్షలు విధించింది.
కేంద్రం విధించిన ఈ భద్రతా ఆంక్షల నేపథ్యంలో జమ్ము, పఠాన్‌కోట్, జోధ్‌పూర్, జైసల్మేర్, సిమ్లా, ధర్మశాల, జామ్‌నగర్ సహా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు కీలక ప్రకటన చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమృత్సర్, బికనేర్, చండీగఢ్, ధర్మశాల, గ్వాలియర్, జమ్మూ, జోధ్‌పుర్, కిషన్‌గఢ్, లేహ్, రాజ్‌కోట్, శ్రీనగర్ సహా పలు ఎయిర్‌పోర్టుల నుంచి మే 10వ తేదీ వరకూ 165కిపైగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో తెలిపింది. మే 10వ తేదీ ఉదయం వరకు శ్రీనగర్, జమ్మూ, లేహ్, జోధ్‌పుర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్, చండీగఢ్ ఎయిర్‌పోర్టులకు తమ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. వీటితోపాటు స్పైస్‌జెట్, ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ విమనాలు కూడా రద్దయ్యాయి.
Also Read..
Jaish-e headquarters | భారత్ దాడుల్లో ధ్వంసమైన జైషే ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయం.. VIDEO
Foreign Media | ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ మీడియా ఆసక్తి