Jaish-e headquarters | పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్.. అందుకు ప్రతీకారం తీర్చుకుంది. పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. ముఖ్యంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పూర్తిగా ధ్వంసం చేసింది.
భారత్ జరిపిన ఈ దాడుల్లో జైషే ఉగ్రసంస్థ (Jaish-e headquarters) ప్రధాన కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్‌పై భారత సైన్యం దాడి చేసింది. దాడిలో ఆ భవంతి పూర్తిగా నేలమట్టమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు భారత్ విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’లో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం మొత్తం హతమైంది. ఆయన కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు సహాయకులు, పలువురు సన్నిహితులు కూడా మరణించినట్లు సమాచారం.
లాహోర్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్ పాక్‌లోనే 12వ అతిపెద్ద నగరం. ఇక్కడ జైషే ప్రధాన కార్యాలయం 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవంతిని ఉస్మాన్-ఓ-అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తారు. పుల్వామా దాడి సహా భారత్‌పై చాలా కుట్రలకు ఇక్కడే పథక రచన చేశారు. ఈ భవనాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషే నెంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ఇందులోనే ఉంటున్నట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
INDIA STRIKES JEM STRONGHOLD: MARKAZ SUBHAN ALLAH IN BAHWALPUR REDUCED TO RUBBLE
India’s precision strike has destroyed Markaz Subhan Allah—Jaish-e-Mohammed (JeM) terror headquarters and training camp in Bahawalpur, Pakistan.
Once a bustling hub of terrorists activity, the site… pic.twitter.com/UyPlQzRPMk
— Anjana Om Kashyap (@anjanaomkashyap) May 7, 2025
Also Read..
Jaish-e chief | ఆపరేషన్ సిందూర్.. జైషే చీఫ్ మసూద్ కుటుంబం హతం
Foreign Media | ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ మీడియా ఆసక్తి