Waqf Act | వక్ఫ్ బిల్లు (Waqf Act)కు నిరసనగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మూకలు సృష్టించిన విధ్వంసంలో దాదాపు 10 మంది పోలీసులు గాయపడ్డారు. హింసను అదుపు చేసేందుకు సరిహద్దు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఇక ఈ హింసకు సంబంధించి 110 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో శుక్రవారం హింస చెలరేగింది. నింతిటా రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలుపై నిరసన కారులు రాళ్లతో దాడి చేశారు. స్టేషన్ ఆస్తిని ధ్వంసం చేశాయి. పోలీసు వ్యాన్లు సహా అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. భద్రతా దళాలపై కూడా రాళ్లు రువ్వి రోడ్లను దిగ్బంధించారు. హింస నేపథ్యంలో ముర్షిదాబాద్‌లో 110 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అందులో సుతి నుంచి 70 మందికాగా, సంసెర్గంజ్ నుంచి 41 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఆయా జిల్లాల్లో ఇవాళ ఉదయం కూడా దాడులు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ముర్షిదాబాద్ జిల్లాలో నిషేధిత ఆజ్ఞలు అమల్లో ఉన్నాయని.. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసినట్లు వెల్లడించారు.
Also Read..
Terror attacks | దేశంలో ఉగ్రవాదులు దాడి చేయొచ్చు.. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
UPI | యూపీఐ సేవల్లో మళ్లీ అంతరాయం.. సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు
Hanuman Jayanti | హనుమాన్ జయంతి.. అయోధ్యకు పోటెత్తిన భక్తులు