UPI | యూపీఐ సేవల్లో మళ్లీ అంతరాయం.. సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు
UPI | దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది.
UPI | దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ ద్వారా జరిగే ఆన్లైన్ సేవలు (Digital transactions) దాదాపు గంట నుంచి నిలిచిపోయాయి.
డౌన్‌డిటెక్టర్ (DownDetector) ప్రకారం.. ఇవాళ ఉదయం 11:26 గంటల ప్రాంతంలో యూపీఐ సేవల్లో సమస్య తలెత్తింది. 11:45 గంటల సమయానికి అది మరింత తీవ్రమైంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవలు పనిచేయడం లేదు. ఈ సమస్యపై వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. నెట్వర్క్ స్లో అని, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కూడా సాధ్యం కావట్లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో సమస్యల గురించి 222 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో యూపీఐపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇంకా స్పందించలేదు. కాగా, మూడు వారాల్లో ఇలా యూపీఐలో సమస్యలు తలెత్తడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
Also Read..
Gold Price | లక్షకు చేరువలో బంగారం.. ఒక్కరోజే 6,250 పెరిగిన తులం ధర
Tariff War | తగ్గేదేలే.. తారస్థాయికి అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

