Sikkim | ఈశాన్య రాష్ట్రం సిక్కింలో (Sikkim) భారీ వర్షాలు (heavy rain) బీభత్సం సృష్టించాయి. ఉత్తర సిక్కింలో నిరంతరం వర్షం పడుతోంది. దీంతో వరదలు సంభవించాయి. భారీ వర్షం కారణంగా కొండచరియలు (landslide) విరిగిపడ్డాయి. దీంతో అధికారులు కీలక రహదారులను మూసివేశారు. ఈ కారణంగా వెయ్యి మందికిపైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు (tourists stranded).
మున్షితాంగ్ ప్రాంతంలోని లాచెన్-చుంగ్తాంగ్ రోడ్డు, లెమా/బాబ్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చాలా ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. గాంగ్టక్ నుండి చుంగ్తాంగ్ వరకూ సుమారు 100 కి.మీ. ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున పరిస్థితి మరింత దిగజారింది. కఠినమైన వాతావరణ పరిస్థితులు, కొండచరియలు విరిగిపడటం వల్ల చుంగ్థాంగ్లో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఆయా ప్రాంతాలకు సందర్శకులకు అనుమతించడం లేదు. ఈ పరిస్థితి కారణంగా వెయ్యి మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన అధికారులు వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read..
Pahalgam Attack | ఉగ్రవాదుల కోసం వేట.. పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు
Bandipora | బందిపొరాలో ఎన్కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
Netflix | నెట్ఫ్లిక్స్ సేవల్లో అంతరాయం.. సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్న సబ్స్క్రైబర్లు