Bandipora | జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో (Pahalgam Attack) మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్లో పర్యాటకులే లక్ష్యంగా ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడితో భారత సైన్యం అప్రమత్తమైంది. జమ్ము ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలింపు చేపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బందిపొరా (Bandipora) జిల్లాలో ఎన్కౌంటర్ చేటచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ (Top LeT commander) హతమయ్యారు.
పెహల్గామ్ దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు గత మూడు రోజులుగా కశ్మీర్ లోయలో ఉగ్రమూకలపై పంజా విసురుతున్నారు. విస్తృతంగా సెర్చ ఆపరేషన్ చేపడుతున్నారు. ఈ క్రమంలో బందిపొరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా నిఘా సమాచారంతో భారత సైన్యం, జమ్ము పోలీసులు ఆ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి (Altaf Lalli) హతమయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి.
ఇక ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) జమ్ము కశ్మీర్‌కు వెళ్లనున్నారు. శ్రీనగర్, ఉదమ్‌పూర్‌లో పర్యటించనున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. ఎల్వోసీ వద్ద ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీయనున్నారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ద్వివేది వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read..
Army Chief | మరికాసేపట్లో జమ్ముకశ్మీర్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
Pahalgam Attack | పెహల్గామ్ దాడి.. ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ