Pahalgam Attack | పెహల్గామ్ నరమేధంపై (Pahalgam Attack) ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్యలకు దిగింది. ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న ఇద్దరు టెర్రరిస్టుల ఇళ్లను ధ్వంసం చేసింది. పెహల్గామ్లో నరమేధం సృష్టించి 26 మందిని బలిగొన్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, ఆషిఫ్ షేక్ (Asif Sheikh) ఇళ్లను సైన్యం ఐఈడీతో పేల్చేసినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. పెహల్గామ్ మారణహోమంలో జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన థోకర్ కీలక నిందితులలో ఒకరుకాగా, ఆషిఫ్ షేక్ ఈ దాడి కుట్రలో పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మరోవైపు ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల సమాచారం తెలియజేసిన వారికి రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తామని జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ పోలీసులు గురువారం ప్రకటించారు. ఈ మేరకు అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తుల స్కెచ్‌లతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. లష్కరే తాయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఈ ముగ్గురిలో ఆదిల్ హుస్సేన్ థోకర్ అనంత్‌నాగ్ వాసి కాగా, అలీ భాయ్ అక తల్హా భాయ్, హషీమ్ ముసాల అకా సులేమాన్‌లు పాకిస్థానీలు.
#WATCH | Tral, J&K | Visuals of a destroyed house that is allegedly linked to a terrorist involved in the Pahalgam terror attack pic.twitter.com/luIH9rQIKR
— ANI (@ANI) April 25, 2025
Also Read..
Amit Shah | భద్రతా లోపాలు నిజమే.. పహల్గాం ఉగ్ర దాడిపై ఒప్పుకున్న అమిత్ షా