Netflix | ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సేవల్లో అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఉదయం నుంచి నెట్‌ఫ్లిక్స్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి (Netflix Down). దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సబ్స్క్రైబర్లు (Subscribers) ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లాగిన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని గంటలుగా ఈ సమస్య కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సమస్యపై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు.
అమెరికాలోని న్యూయార్క్, చికాగో, డల్లాస్, లాస్ ఏంజెల్స్ నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి యూజర్లు సమస్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లాగిన్ చేస్తుంటే.. ఎర్రర్ మెసేజ్ వస్తోందని, ఖాతాలను ఓపెన్ చేయలేకపోతున్నామని తమ పోస్టుల్లో పేర్కొంటున్నారు. ‘సమ్ థింగ్ వెంట్ రాంగ్.. కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించండి’ అనే సందేశం స్క్రీన్‌పై దర్శనమిస్తున్నట్లు యూజర్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు సమస్యలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను కూడా తమ పోస్టులకు జత చేస్తున్నారు.
Also Read..
Army Chief | మరికాసేపట్లో జమ్ముకశ్మీర్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
Pahalgam Attack | పెహల్గామ్ దాడి.. ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ
Pak opens Firing | పాక్ కవ్వింపు చర్య.. సరిహద్దుల్లో భారత్ సైన్యంపైకి కాల్పులు