శ్రీనగర్: కుక్కతోక వంకర అన్నట్లు పాకిస్థాన్ వక్రబుద్ధి (Pak opens Firing) మారడం లేదు. ఓవైపు తమదికాని కశ్మీర్ గురించి అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిందే దాయాది దేశం.. మరోవైపు ఉగ్రవాదాన్ని ఎగదోస్తు కశ్మీర్లో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నది. తాజాగా పహల్గాంపైకి ముష్కరులను ఎగదోసి 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నది. ఈ నేపథ్యంలో మరోసారి భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పిడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిచిన పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి (LOC) పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి భారత బలగాలపైకి కాల్పులు జరిపారు. అయితే శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటున్నది. పాక్ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తున్నది.
సరిహద్దు వెంబడి పాకిస్థాన్ ఆర్మీ చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిపిందని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు. మన బలగాలు దానిని తిప్పికొట్టాయని చెప్పారు. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని తెలిపారు.