Cheetah | కునో నేషనల్ పార్క్ (Kuno National Park)లో చీతాల (Cheetah) మరణ మృదంగం కొనసాగుతోంది. తాజాగా మంగళవారం మరో చీతా మృతి చెందింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన పవన్ (Pawan) అనే మగ చీతా మరణించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
నమీబియా (Namibia) నుంచి తీసుకొచ్చిన వాటిలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఏకైక చీతా (Only free-ranging cheetah) ఇదే అని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో పొదల్లో ఎలాంటి కదలికలూ లేకుండా కనిపించిందని తెలిపారు. చీతా తలతో సహా సగం శరీరభాగం మొత్తం నీటిలో మునిగి ఉందన్నారు. శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలూ లేవని పేర్కొన్నారు. ‘నమీబియా నుంచి తీసుకొచ్చిన వాటిలో పవన్ మాత్రమే ఫ్రీ రేంజ్ చిరుత. దాని లొకేషన్‌ను అధికారులు ఎప్పటికప్పుడు ట్రేస్ చేస్తూనే ఉన్నారు. అయితే, మంగళవారం పవన్ కదలికలు ట్రేస్ కాకపోవడంతో ట్రాకింగ్ టీమ్ అప్రమత్తమైంది. గాలించగా.. పొదల్లో మృతి చెంది కనిపించింది’ అని అటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
నీటిలో మునగడం వల్లే చీతా మరణించి ఉంటుందని ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం చీతా మృతికి కారణాలు తెలుస్తాయని వెల్లడించారు. కాగా, ఆగస్టు నెలలోనే కూనో పార్కులో ఇది రెండో చీతా మరణం. ఈ నెల 5వ తేదీన ఆఫ్రికన్ చీతా గామినికి జన్మించిన ఐదు నెలల చీతా కూన మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూనో పార్క్‌లో 24 చీతాలు ఉన్నాయి. వాటిలో 12 పెద్దవి కాగా, అనేక కూన చీతలు ఉన్నాయి.
ప్రాజెక్ట్ చీతాలో భాగంగా.. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు దఫాలుగా భారత్‌కు చీతాలను తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వదిలారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వివిధ కారణాలతో చీతాలు ఒక్కొక్కటిగా మరణించటం ప్రారంభమైంది.
Also Read..
Purushothamudu | ఓటీటీలోకి రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Watch: గుంతల రోడ్డులో లాంగ్ జంప్ పోటీలు నిర్వహించిన యముడు.. వీడియో వైరల్
President Droupadi Murmu: కోల్‌కతా ఘటన భయానకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము