Purushothamudu | టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. హాసినీ సుధీర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు రామ్ భీమన దర్శకత్వం వహించగా.. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మించారు. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అహా పోస్టర్ పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇండియాలోని పెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరు పరశురామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్య రామ్(మురళి శర్మ). అతని కొడుకే రచిత్ రామ్(రాజ్ తరుణ్). లండన్‌లో చదువుకొని ఇండియాకు తిరిగివస్తాడు. అయితే రచిన్ రాగనే పీఆర్ గ్రూప్స్ కొత్త సీఈవోగా నియమించాలి అనుకుంటాడు ఆదిత్య రామ్. అయితే దీనికి రచిత్ రామ్ పెద్దమ్మ (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్ ప్రకారం సీఈఓ అవ్వాల్సిన వ్యక్తి ఎవరికీ తెలియకుండా 100 రోజుల పాటు ఓ సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాలని గుర్తుచేస్తుంది. దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని కడియం దగ్గరలో ఉన్న రాయపులంక అనే పల్లెటూరికి చేరుకుంటాడు రచిత్ రామ్. ఆ లంకలో నర్సరీ నడుపుతున్న అమ్ములు(హాసిని సుధీర్) దగ్గర పనిలో చేరుతాడు. అయితే రచిత్ రామ్ ఆ లంకకు వెళ్లిన అనంతరం జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతడు.. ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు? ఈ మధ్యలో రచిత్ – అమ్ములు ప్రేమ కథేంటి అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
#Purushotamudu premieres on Aha from Aug 29. pic.twitter.com/sysi5q6sMK
— Movies4u (@Movies4uOfficl) August 28, 2024
ALso Read..