Suriya 44 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ కాంపౌండ్ నుంచి ఇప్పటికే కంగువ విడుదలకు ముస్తాబుతోంది. ఈ సినిమా విడుదల కాకముందే సూర్య 44 (Suriya 44)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య. స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
తొలి షెడ్యూల్లో భాగంగా అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తోపాటు సూర్య, పూజాహెగ్డేపై వచ్చే సాంగ్స్‌ను చిత్రీకరించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్‌లో మెరువనుంది. ఊటీ షెడ్యూల్లో ఈ పాటను చిత్రీకరించనున్నారట మేకర్స్. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఇడుక్కి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్టు సమాచారం.
ఈ చిత్రంలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు. పీరియాడిక్ వార్ అండ్ లవ్ నేపథ్యంలో వస్తోన్న సూర్య 44కు తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్ డీవోపీగా పనిచేస్తున్నాడు. సూర్య హోంబ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ 2025 పొంగళ్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
#SURIYA44 : Suprise⭐️
• Actress #ShriyaSaran On Board😍
• She Has Performed A Special Dance Number in The Film❤️
• Her Portion Shoot Happened During The Ooty Schedule🔥
• Now Currently Shoot Happening At Idukki Kerala Areas🤙#Suriya | #SaNa | #KarthikSubbaraj— Saloon Kada Shanmugam (@saloon_kada) August 28, 2024
Nani | ఒకే ఫ్రేమ్‌లో నాని, శివరాజ్‌కుమార్.. స్పెషల్ ఏంటో తెలుసా..?
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!