Cyclone Dana | తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘దానా’ తుఫాన్ (Cyclone Dana).. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ఇది ఇవాళ అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రస్తుతం ఈ తీవ్ర తుఫాను ఒడిశా (Odisha)లోని పరాదీప్‌కు 260 కిలోమీటర్లు.. ధమ్రాకు 290 కి.మీ దూరంలో.. బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ అప్రమత్తమయ్యాయి. ‘దానా’ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యా సంస్థలను సైతం మూసివేశారు.
#WATCH | Odisha: As #CycloneDana is expected to make landfall over the Odisha-West Bengal coast, between October 24-25; district administration alert people at the Puri beach pic.twitter.com/MNp1ZrH7nZ
— ANI (@ANI) October 24, 2024
తీవ్ర తుఫాను నేపథ్యంలో భారత పురావస్తు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా ఒడిశాలోని రెండు ప్రధాన ఆలయాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. పూరీలోని జగన్నాథ ఆలయం (Jagannath Temple)తోపాటు.. కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని (Konark Temple) మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తుఫాను కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ఆలయాలను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
#WATCH | Odisha: Strong winds and rainfall witnessed in Bhadrak's Dhamra as #CycloneDana is expected to make landfall over the Odisha-West Bengal coast, between October 24-25 pic.twitter.com/mCSVHBkZOT
— ANI (@ANI) October 24, 2024
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో వెలసిన ఈ రెండు ఆలయాలు ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయాల సందర్శనకు దేశ నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. తుఫాన్ కారణంగా ముందు జాగ్రత్తగా ఈ ఆలయాలను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆలయాలతోపాటు పలు స్మారక చిహ్నాలు, మ్యూజియంలను సైతం మూసివేయనున్నారు.
#WATCH | Odisha | As #CycloneDana is expected to make landfall over the Odisha-West Bengal coast, between October 24-25, district administration including SDRF evacuate people from the Puri beach pic.twitter.com/lMQ5SEKGAP
— ANI (@ANI) October 24, 2024
ఇదిలా ఉండగా.. ఒడిశాలోని గంజాం, పూరీ, జగత్సింగ్పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, మయూర్భంజ్, కియోంజర్, ధెంకనల్, జాజ్‌పూర్, అంగుల్, ఖోర్ధా, నయాగర్, కటక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐంఎడీ అంచనా వేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు.. ఆయా జిల్లాల్లో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు.
ఇక దానా తుఫాను కారణంగా సౌత్ ఈస్టర్న్ పరిధిలో నడిచే దాదాపు 150 రైళ్లను అధికారులు రద్దు చేశారు. హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, కామాఖ్య – యశ్వంత్‌పూర్ ఏసీ ఎక్స్‌ప్రెస్, హౌరా-పూరీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, హౌరా – భువనేశ్వర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, హౌరా – యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు రద్దయ్యాయి.
Also Read..
India Post | ఇండియా పోస్ట్‌కు షాక్.. అర్ధ రూపాయి చెల్లించనందుకు రూ.15,000 ఫైన్
Maharashtra Elections | బీజేపీ కంచుకోట బద్దలవుతుందా?.. పట్టు నిలుపుకునేందుకు కమలం ఆరాటం!
First Farmers | భూమిపై వ్యవసాయం చేసిన తొలి జీవి చీమ.. మనుషుల కంటే 6.6 కోట్ల ఏండ్ల ముందే సేద్యం