శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 11:20:43

ఒడిశా గ‌వ‌ర్న‌ర్ గ‌ణేషీ లాల్‌జీకి క‌రోనా

ఒడిశా గ‌వ‌ర్న‌ర్ గ‌ణేషీ లాల్‌జీకి క‌రోనా

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశా గ‌వ‌ర్న‌ర్ ప్రొఫెస‌ర్ గ‌ణేషీ లాల్ జీ క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్‌తోపాటు ఆయ‌న స‌తీమ‌ణి, మరో నలుగురు కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకింద‌ని రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో వారంతా భువ‌నేశ్వ‌ర్‌లోని ఎస్‌యూఎం కోవిడ్ ద‌వాఖాన‌లో చేరార‌ని అధికారులు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి బాగానే ఉంద‌ని తెలిపారు. కాగా, ఈ మ‌ధ్య‌కాలంలో గ‌వ‌ర్న‌ర్ దంపతుల‌ను క‌లిసిన‌వారు క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని సూచించారు. ‌

క‌రోనా బారిన‌ప‌డిన గ‌వ‌ర్న‌ర్ గ‌ణేషీ లాల్ జీ వేగంగా కోలుకోవాల‌ని ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఆకాంక్షించారు. ఆయ‌న‌కు సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా తిరిగి రావాల‌ని ప్రార్థిస్తున్నాని తెలిపారు. ఈమేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.