అందరిలానే నాకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి: శృతి హాసన్

కమల్ గారాల పట్టి శృతి హాసన్ చాలా బోల్డ్ గా మాట్లాడుతుందనే సంగతి మనందరికి తెలిసిందే. తాజాగా తను ఇండిపెండెంట్‌గానే ముందుకు వెళుతున్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను ఎవరిపై ఆధారపడనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమ్మ, నాన్న సాయం నేను ఎప్పుడు తీసుకోను. నా కాళ్ల మీద నిలబడటానికే నేను ప్రయత్నిస్తాను. నా ఖర్చులకి నేనే సంపాదించుకుంటాను. నా బిల్లులు చెల్లించుకోవాలి అంటే పని చేయక తప్పదు. లేదంటే ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి.
గతంలో పలు సమస్యలు ఎదుర్కొన్నాను. కరోనా ఎప్పుడు అంతం అవుతుంది అనే దాని కోసం నేను వెయిట్ చేయను. నేను ఒప్పుకున్న ప్రాజెక్ట్ నుండి పిలుపు వస్తే షూటింగ్‌కు వెళతాను. అందరిగానే నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాటి కోసమైన పని చేయక తప్పదు. వ్యక్తిగతం, వృత్తి పరమైన నిర్ణయాలు సొంతంగా తీసుకుంటాను. కరోనా వలన చాలా మంది ఖరీదైన కార్లు, ఇళ్లు కొనే ప్రయత్నం చేయలేదని చెబుతుంటారు. నేను మాత్రం ఓ ఇల్లు కొనుకున్నా. స్వయం కృషితో ఎదగడం నేను చాలా ఇష్టపడతాను. నా వెనుకు దేవుడు ఉన్నాడని బలంగా విశ్వసిస్తాను అంటూ శృతి హాసన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

