సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 19:05:23

థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువ‌డే బూడిదతో జియో పాలిమ‌ర్ కంకర

 థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువ‌డే బూడిదతో జియో పాలిమ‌ర్ కంకర

ఢిల్లీ: థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువ‌డే బూడిద నుండి జియో పాలిమ‌ర్ ముత‌క కంక‌ర‌ను భార‌త‌దేశంలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్ప‌త్తిదారు, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌టిపిసి లిమిటెడ్ విజ‌య‌వంతంగా అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్క‌ర‌ణతో స‌హ‌జ కంక‌ర స్థానంలో ప్ర‌త్యామ్నయం ప‌ర్యావ‌ర‌ణంపై ప్ర‌భావాన్నిత‌గ్గించేందుకు తోడ్ప‌డుతుంది. థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువ‌డే బూడిద నుంచి జియో పాలిమ‌ర్ ముత‌క కంక‌ర ఉత్ప‌త్తిపై ఎన్‌టిపిసి రీసెర్చ్ ప్రాజెక్టు జాతీయ ప్ర‌మాణాల చ‌ట్ట‌బ‌ద్ధ పారామితుల‌కు అనుగుణంగా ఉంది.  దీనిని జాతీయ కౌన్సిల్ ఫ‌ర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియ‌ల్స్ (ఎన్‌సిసిబిఎం) ధృవీక‌రించింది.

స‌హ‌జ కంక‌ర స్థానంలో జియో పాలిమ‌ర్ ముత‌క కంక‌ర‌ను ఎన్‌టిపిసి విజ‌య‌వంతంగా అభివృద్ధి చేసింది. దానిని కాంక్రీటు ప‌నుల‌లో ఉప‌యోగించ‌డానికి ఎంత అనువుగా ఉంది అనే విష‌యాన్ని భార‌తీయ ప్ర‌మాణాల‌కు అనుగుణ‌మైన సాంకేతిక పారామితుల‌ను ఎన్‌సిసిబిఎం, హైద‌రాబాద్ ప‌రీక్షించింది. ఫ‌లితాలు ఆమోదించ‌ద‌గిన స్థాయిలో ఉన్నాయి. బూడిద వినియోగంపై ఎన్‌టిపిసి ప‌రిశోధ‌న‌, అభివృద్ధి విజ‌యం దాని అవ‌ధుల‌ను విస్త‌రింప‌చేసింది. ప్ర‌తి ఏడాది భార‌త్‌లో 2000 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల కంక‌ర‌కు డిమాండ్ ఉంటుంది. థర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువ‌డిన బూడిద ఈ డిమాండ్‌ను చాలావ‌రకు తీర్చేందుకు సాయ‌ప‌డ‌డ‌మే కాకుండా, స‌హ‌జ రాతిని తొలిచడం వ‌ల్ల ఏర్ప‌డే స‌హ‌జ కంక‌ర ప‌ర్యావ‌ర‌ణం పై చూపే ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంది.కియా మోటార్స్ ఇండియా ‘మై కన్వీనియెన్స్‌’ సర్వీసెస్ లాంచ్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.