బానుడి భగభగ.. బస్సులెక్కడ..?
గ్రేటర్లో బస్సులు అందుబాటులో లేక బస్టాపుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మండుతున్న ఎండల్లో సమయానికి బస్సులు రాక నానా యాతన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచి ప్రయాణికులను ఎండ నుంచి రక్షించాల్సింది పోయి..
- కోటి జనాభాకు.. ఉన్నవి 2600 బస్సులే
- మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సుల కుదింపు
- రోడ్లపై ఎండలోనే నిరీక్షిస్తున్న ప్రయాణికులు
- గ్రేటర్ ఆర్టీసీ నిర్ణయంపై ప్రయాణికుల ఆగ్రహం
- బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికుల డిమాండ్
- పేరుకే ప్రీ బస్.. క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయించాల్సిన దుస్థితి
సిటీబ్యూరో, ఏప్రిల్ 19 ( నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో బస్సులు అందుబాటులో లేక బస్టాపుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మండుతున్న ఎండల్లో సమయానికి బస్సులు రాక నానా యాతన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచి ప్రయాణికులను ఎండ నుంచి రక్షించాల్సింది పోయి.. అదే ఎండల కారణంగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సుల సంఖ్య కుదిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బస్సుల సంఖ్య తగ్గింపు సరికాదు
నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాల కోసం చాలా మంది బస్సులపై ఆధారపడుతుంటారు. ఇది నిరంతర ప్రక్రియ. పలాన సమయంలో ప్రయాణాలు రద్దు చేసుకోండి అంటే జీవిత బండి నడిచే పరిస్థితి ఉండదు. కంపెనీల్లో షిఫ్టుల ప్రకారం పనులుంటాయి. ఉదయం ఉద్యోగాలకు వెళ్లిన వాళ్లు మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వస్తుంటారు. మరోవైపు ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులు ఉదయం బయలుదేరితే మధ్యాహ్నం నగరానికి చేరుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బస్సుల సంఖ్య తగ్గిస్తే వారంతా తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. మండుతున్న ఎండల్లో బస్సులు లేక పిల్లలు, వృద్ధులతో వారంతా ఎలా గమ్యస్థానాలకు చేరుకోవాలో చెప్పాలని ప్రయాణికులు నిలదీస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి.. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గించడం మోసం చేయడమేనని వాపోయారు.
అవసరం 7వేల బస్సులు.. ఉన్నది 2600 మాత్రమే
గ్రేటర్ జనాభా కోటి మించింది. ఈ పరిస్థితిలో వారి రాకపోకలకు నగరంలో కనీసం 7వేల బస్సులు సమకూర్చాల్సిన అవసరం ఉందని ఇప్పటికే రవాణా రంగ నిపుణులు నివేదికలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ బస్సుల సంఖ్య గ్రేటర్ జనాభాకు తగ్గట్టు పెంచలేదు. ఆర్టీసీ నష్టాల కారణంగా బస్సుల సంఖ్య పెంచలేకపోతున్నామంటూ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో 2800 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా ఇందులో ప్రస్తుతం 2600 బస్సులు నడుస్తున్నాయి. 30వేల ట్రిప్పులు కొనసాగుతున్నాయి. ఇవి సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సుల సంఖ్య కుదించడం ప్రయాణికులకు మరిన్ని ఇబ్బందులు కల్గించడమేనని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ సమస్య నగరంలో జఠిలంగా మారింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల ట్రిప్పులు తగ్గిస్తే సాయంత్రం 4 నుంచి ట్రాఫిక్ సమస్య మరింత పెరగనున్నదని అంటున్నారు.
మధ్యాహ్న సమయంలో బస్సులు పెంచాలి
నగరంలో మధ్యాహ్న సమయంలో బస్సులను తగ్గించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గంటల కొద్దీ వేచి చూసినా బస్సులు రావడం లేదు. చివరకు క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు.
– దేవిశెట్టి బాలాజీ, వివేకానందనగర్‌కాలనీ
బస్సులు యథావిధిగా నడపాలి
సరిఫడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆర్టీసీ బస్సులను తగ్గించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. అసలే వేసవి కాలం ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడుతున్నారు. కనీసం ఉన్న బస్సులనైనా యథావిధిగా పునరుద్ధరించి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలి.
-మెండ రఘు, ప్రయాణికుడు, ఉప్పల్.
సిటీలో బస్సుల సంఖ్యను పెంచాలి
నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్ చుట్టుపక్కల గ్రామాల నుంచి నగరానికి వివిధ పనుల నిమిత్తం వేలాది సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల సంఖ్య సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ ఉన్న బస్సుల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కుదించడం సరైన నిర్ణయం కాదు. గత ప్రభుత్వ హయాంలో పది నిమిషాలకు ఒకసారి బస్సులు నడుస్తుండేది.
– కట్ట వెంకటేశ్ ముదిరాజ్, హయత్‌నగర్.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

